కోచ్‌ కానందుకు బాధ లేదు

భారత క్రికెట్‌ జట్టు కోచ్‌ కానందుకు బాధగా లేదని.. విరాట్‌ కోహ్లి తనను సంప్రదించకపోతే అసలు ఈ పదవికి దరఖాస్తే చేసేవాడిని కాదని మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు.

Published : 21 Mar 2023 03:19 IST

దిల్లీ: భారత క్రికెట్‌ జట్టు కోచ్‌ కానందుకు బాధగా లేదని.. విరాట్‌ కోహ్లి తనను సంప్రదించకపోతే అసలు ఈ పదవికి దరఖాస్తే చేసేవాడిని కాదని మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. 2017లో కోచ్‌గా అనిల్‌ కుంబ్లే వారసుడిని వెతికే క్రమంలో వీరూని బోర్డు సంప్రదించింది. కానీ చివరికి రవిశాస్త్రికి అవకాశం దక్కింది. ‘‘అప్పటి కెప్టెన్‌ కోహ్లి, బీసీసీఐ కార్యదర్శి అమితాబ్‌ చౌదరి సంప్రదించకపోతే కోచ్‌ పదవికి దరఖాస్తు కూడా చేసేవాడిని కాదు. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ తర్వాత అనిల్‌ కుంబ్లే పదవి కాలం ముగిసిపోతుందని.. కోచ్‌ పదవికి ఎంపిక చేయబోతున్నామని త్వరలో జరిగే వెస్టిండీస్‌ పర్యటనకు బాధ్యతలు స్వీకరించాలని కోహ్లి, అమితాబ్‌ చెప్పారు. కానీ కోచ్‌ పదవి రాకపోయినా నాకెలాంటి బాధా లేదు. టీమ్‌ఇండియా తరఫున ఎన్నో సాధించా. ఒక రైతు కుటుంబంలో పుట్టి దేశానికి ఆడే అవకాశాన్ని అందుకున్నా. అభిమానుల విశేష ఆదరణ పొందా. భారత్‌కు కెప్టెన్‌గా ఉన్నా కూడా ఇంతటి గౌరవం దక్కేది కాదేమో’’ అని వీరూ అన్నాడు. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్‌ చేతిలో భారత్‌ ఓటమి తర్వాత అనిల్‌ కుంబ్లే కోచ్‌ పదవి నుంచి తప్పుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని