ఐర్లాండ్‌ చిత్తు.. బంగ్లాదే వన్డే సిరీస్‌

ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌ను బంగ్లాదేశ్‌ 2-0తో సొంతం చేసుకుంది. పేసర్‌ హసన్‌ మహమూద్‌ (5/32) విజృంభించడంతో మూడో వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్‌ 10 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తుచేసింది.

Published : 24 Mar 2023 03:29 IST

సిల్హెట్‌: ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌ను బంగ్లాదేశ్‌ 2-0తో సొంతం చేసుకుంది. పేసర్‌ హసన్‌ మహమూద్‌ (5/32) విజృంభించడంతో మూడో వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్‌ 10 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తుచేసింది. మొదట ఐర్లాండ్‌ 28.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. హసన్‌కు తోడు తస్కిన్‌ అహ్మద్‌ (3/26),  ఇబాదత్‌ హొస్సేన్‌ (2/29) సత్తాచాటారు. బంగ్లా 13.1 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్‌ తమిమ్‌ ఇక్బాల్‌ (41 నాటౌట్‌; 41 బంతుల్లో 5×4, 2×6), లిటన్‌ దాస్‌ (50 నాటౌట్‌; 38 బంతుల్లో 10×4) అజేయంగా నిలిచారు. సిరీస్‌లో రెండో  మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని