అదరగొట్టిన శ్రీజ
తెలంగాణ టేబుల్ టెన్నిస్ సంచలనం ఆకుల శ్రీజ అదరగొట్టింది. మహిళల సింగిల్స్‌లో జాతీయ ఛాంపియన్‌షిప్ టైటిల్ నిలబెట్టుకోవడంతో పాటు మరో రెండు స్వర్ణాలు, ఓ కాంస్యం ఖాతాలో వేసుకుంది.
సింగిల్స్‌లో రెండోసారి జాతీయ ఛాంపియన్
మరో రెండు స్వర్ణాలు, కాంస్యం కైవసం
జమ్ము: తెలంగాణ టేబుల్ టెన్నిస్ సంచలనం ఆకుల శ్రీజ అదరగొట్టింది. మహిళల సింగిల్స్‌లో జాతీయ ఛాంపియన్‌షిప్ టైటిల్ నిలబెట్టుకోవడంతో పాటు మరో రెండు స్వర్ణాలు, ఓ కాంస్యం ఖాతాలో వేసుకుంది. ఆర్‌బీఐ తరపున బరిలో దిగిన ఆమె.. టీమ్, మహిళల డబుల్స్‌లోనూ బంగారు పతకాలు పట్టేసింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్యం సొంతం చేసుకుంది. పోటీపడిన అన్ని విభాగాల్లోనూ ఆమె పతకాలు గెలవడం విశేషం. సోమవారం సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 9-11, 14-12, 11-7, 13-11, 6-11, 12-10 తేడాతో సుతీర్థ (పశ్చిమ బెంగాల్)పై నెగ్గింది. తొలి గేమ్‌లో ఓటమితో పోరును మొదలెట్టిన ఆమె.. ఒత్తిడిని అధిగమించి బలంగా పుంజుకుంది. వరుసగా మూడు గేమ్‌లు గెలిచి టైటిల్‌కు చేరువైంది. కానీ అయిదో గేమ్‌లో ఓటమి ఎదురైనా.. ఆరో గేమ్‌లో పోరాడి నెగ్గిన శ్రీజ వరుసగా రెండో సారి జాతీయ సీనియర్ ఛాంపియన్‌గా నిలిచింది. మహిళల డబుల్స్ తుదిపోరులో శ్రీజ- దియా జోడీ 11-7, 11-7, 8-11, 14-12తో స్వస్థిక- శ్రుతి (మహారాష్ట్ర) జంటపై విజయం సాధించింది. మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్‌లో మానుష్- శ్రీజ 9-11, 10-12, 12-10, 5-11తో మానవ్- అర్చన చేతిలో ఓడి కంచుకే పరిమితమయ్యారు. మహిళల టీమ్ విభాగంలో ఇప్పటికే ఆర్బీఐ 3-2తో తమిళనాడుపై గెలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు పురుషుల డబుల్స్‌లో తెలంగాణ జోడీ.. మహమ్మద్ అలీ- వాన్ష్ సింఘాల్ రజతం నెగ్గారు. ఫైనల్లో ఈ జంట 6-11, 7-11, 6-11తో జీత్‌చంద్ర- అంకుర్ (పశ్చిమ బెంగాల్) చేతిలో ఓడింది. సింగిల్స్ టైటిల్‌ను సత్యన్ సొంతం చేసుకున్నాడు. నిరుడు కామన్వెల్త్ క్రీడల మిక్స్‌డ్ డబుల్స్‌లో శరత్ కమల్‌తో కలిసి ఛాంపియన్‌గా నిలిచిన శ్రీజ నిలకడగా రాణిస్తోంది. ఈ ఏడాది జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఆమె బరిలో దిగనుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
రూ.99కే కొత్త సినిమా.. విడుదలైన రోజే ఇంట్లో చూసే అవకాశం
-
Ap-top-news News
జులై 20న విజయనగరంలో ‘అగ్నివీర్’ ర్యాలీ
-
India News
మృతదేహంపై కూర్చుని అఘోరా పూజలు
-
India News
దిల్లీలో బయటపడ్డ 2,500 ఏళ్లనాటి అవశేషాలు
-
Ts-top-news News
ధరణిలో ఊరినే మాయం చేశారు
-
Sports News
ఎంతో భావోద్వేగానికి గురయ్యా.. మరోసారి అలాంటి బాధ తప్పదనుకున్నా: సీఎస్కే కోచ్