భారత్‌తో బంధం ప్రత్యేకమైంది: ఏబీ డివిలియర్స్‌

భారత్‌తో బంధం చాలా ప్రత్యేకమైందని ఏబీ డివిలియర్స్‌ అన్నాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు డివిలియర్స్‌, క్రిస్‌ గేల్‌లలను హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చేర్చడంతో పాటు.. వారిద్దరి జెర్సీలను రిటైర్‌ చేర్చింది. ఈ నేపథ్యంలో ఏబీ సామాజిక మాధ్యమంలో అభిమానులతో తన భావాలను పంచుకున్నాడు.

Updated : 29 Mar 2023 04:41 IST

బెంగళూరు: భారత్‌తో బంధం చాలా ప్రత్యేకమైందని ఏబీ డివిలియర్స్‌ అన్నాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు డివిలియర్స్‌, క్రిస్‌ గేల్‌లలను హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చేర్చడంతో పాటు.. వారిద్దరి జెర్సీలను రిటైర్‌ చేర్చింది. ఈ నేపథ్యంలో ఏబీ సామాజిక మాధ్యమంలో అభిమానులతో తన భావాలను పంచుకున్నాడు. ‘‘ఆర్సీబీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో గేల్‌తో పాటు నా పేరు కూడా చేర్చారు. నా జెర్సీ 17, గేల్‌ జెర్సీ 333ను కూడా రిటైర్‌ చేశారు. కుటుంబంతో సహా ఆర్సీబీ డ్రెస్సింగ్‌రూమ్‌లోకి వెళ్లినప్పుడు భిన్న అనుభూతిని పొందా. మా డ్రెస్సింగ్‌రూమ్‌లో బాల్కనీలోకి వెళ్లినప్పుడు ‘ఏబీడీ’ అనే నినాదాలు మళ్లీ విని కళ్లు చెమర్చాయి. నా జట్టుకు, ఫ్రాంఛైజీకి, అమితమైన ప్రేమ పంచే అభిమానులకు రుణపడి ఉంటా. భారత్‌లో ఎన్నో అమూల్యమైన రోజులు గడిపా. ఇక్కడ ప్రజలతో, దేశంతో లోతైన బంధం ఉంది’’ అని డివిలియర్స్‌ అన్నాడు. 2008లో దిల్లీ డేర్‌డెవిల్స్‌ తరఫున ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన డివిలియర్స్‌.. 2011 నుంచి 2021 వరకు బెంగళూరుకు ఆడాడు. మెరుపు బ్యాటింగ్‌తో ఎన్నో మ్యాచ్‌ల్లో ఒంటిచేత్తో ఆర్సీబీకి విజయాన్ని అందించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని