రోహిత్‌ కోరితేనే విశ్రాంతి

కెప్టెన్‌ రోహిత్‌శర్మకు విశ్రాంతి అవసరం లేదని భావిస్తున్నట్లు ముంబయి ఇండియన్స్‌ చీఫ్‌ కోచ్‌ మార్క్‌ బౌచర్‌ అన్నాడు. అతను కోరితేనే ఒకటి, రెండు మ్యాచ్‌లకు విశ్రాంతినిస్తామని బౌచర్‌ చెప్పాడు. ‘

Published : 30 Mar 2023 03:02 IST

ముంబయి: కెప్టెన్‌ రోహిత్‌శర్మకు విశ్రాంతి అవసరం లేదని భావిస్తున్నట్లు ముంబయి ఇండియన్స్‌ చీఫ్‌ కోచ్‌ మార్క్‌ బౌచర్‌ అన్నాడు. అతను కోరితేనే ఒకటి, రెండు మ్యాచ్‌లకు విశ్రాంతినిస్తామని బౌచర్‌ చెప్పాడు. ‘‘రోహిత్‌ జట్టు కెప్టెన్‌. అతను విశ్రాంతి తీసుకోకూడదనే ఆశిస్తున్నా. అయితే ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉంటాం. సారథిగా, ఆటగాడిగా అతను అత్యుత్తమంగా రాణిస్తే ఆనందమే. అలాంటి సమయంలో ఒకటి, రెండు మ్యాచ్‌ల్లో విశ్రాంతి కావాలని కోరితే నాకెలాంటి అభ్యంతరం లేదు. పనిభారం గురించి చాలా చర్చలు జరగుతున్నాయి. మా షెడ్యూల్‌ పరిశీలిస్తే మధ్యలో కావాల్సినంత విశ్రాంతి ఉంది. కాబట్టి ఐపీఎల్‌లో పనిభారం సమస్యగా కనిపించడం లేదు. టీ20 క్రికెట్లో పనిభారం గురించి కొన్నిసార్లు మీడియా, జనాలు అతిగా స్పందిస్తారు. టెస్టులు, వన్డే క్రికెట్‌తోనే దేహంపై ఎక్కువ భారం పడుతుంది. టీ20 క్రికెట్‌ చాలా చిన్నది. పనిభారం గురించి మాట్లాడుకోకూడదని కోరుతున్నా. సూర్యకుమార్‌ యాదవ్‌ మంచి లయలోనే ఉన్నాడు. ఒక ఆటగాడు తొలి బంతిని ఎలా ఆడుతున్నాడన్నదాని ఆధారంగా అతని ఫామ్‌ను అంచనా వేయలేం. ఐపీఎల్‌లో సూర్య మొదటి బంతిని ఎదుర్కొన్నప్పుడు ప్రేక్షకులంతా ఆనందిస్తారు. అతను మళ్లీ పరుగులు రాబడతాడు’’ అని బౌచర్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని