Sourav Ganguly: కోహ్లిని అన్‌ఫాలో చేసిన దాదా

దిల్లీ క్యాపిటల్స్‌ డైరెక్టర్‌ సౌరభ్‌ గంగూలీ, రాయల్స్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ విరాట్‌ కోహ్లి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్‌ని దాదా అన్‌ఫాలో చేశాడు.

Updated : 19 Apr 2023 08:05 IST

కోల్‌కతా: దిల్లీ క్యాపిటల్స్‌ డైరెక్టర్‌ సౌరభ్‌ గంగూలీ, రాయల్స్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ విరాట్‌ కోహ్లి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్‌ని దాదా అన్‌ఫాలో చేశాడు. తాజాగా దిల్లీ, బెంగళూరు మధ్య ఐపీఎల్‌ మ్యాచ్‌లో కొరకొర చూసుకున్న వీళ్లిద్దరూ కనీసం కరచాలనం చేసుకోలేదు. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజే గంగూలీని ఇన్‌స్టాలో కోహ్లి అన్‌ఫాలో చేయగా.. తాజాగా దాదా కూడా అదే పని చేశాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఉన్న సమయంలోనే టీమ్‌ఇండియా వన్డే కెప్టెన్‌గా విరాట్‌పై వేటు పడింది. అప్పటినుంచి వీళ్లిద్దరి మధ్య సత్సంబంధాలు లేవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని