Sehwag: రోహిత్‌ది మానసిక సమస్య.. బౌలర్లను కాదు.. తనను తానే ఎదుర్కొంటున్నాడు: సెహ్వాగ్‌

ఐపీఎల్‌-16లో మంబయి ఇండియన్స్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ వైఫల్యం సాంకేతిక సమస్య వల్ల కాదని, మానసిక ఒత్తిడి వల్లేనని భారత క్రికెట్‌ మాజీ స్టార్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ విశ్లేషించాడు.

Published : 10 May 2023 07:58 IST

దిల్లీ: ఐపీఎల్‌-16లో మంబయి ఇండియన్స్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ వైఫల్యం సాంకేతిక సమస్య వల్ల కాదని, మానసిక ఒత్తిడి వల్లేనని భారత క్రికెట్‌ మాజీ స్టార్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ విశ్లేషించాడు. ‘‘రోహిత్‌.. బౌలర్లను ఎదుర్కోవట్లేదు. తనను తానే ఎదుర్కొంటున్నాడు.  అతడి సమస్య సాంకేతికం కాదు, మానసికం. రోహిత్‌ టెక్నిక్‌లో లోపమేమీ కనిపించట్లేదు. కానీ అతడి మనసులో కాస్త గందరగోళం ఉన్నట్లు అనిపిస్తోంది. ఒకసారి గాడిలో పడితే వైఫల్యాలను మరిపించే సత్తా ఈ ఓపెనర్‌కు ఉంది’’ అని వీరూ చెప్పాడు. ఇప్పటిదాకా ఈ ఐపీఎల్‌ సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌.. 17.36 సగటుతో 191 పరుగులే చేశాడు. పంజాబ్‌, చెన్నైపై వరుసగా ‘0’కే వెనుదిరిగి ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక డకౌట్ల (16) రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌-16లో ఇప్పటిదాకా రోహిత్‌ ఒక్క అర్ధసెంచరీ (దిల్లీపై 65) మాత్రమే చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని