IPL: ఆ ఒక్కటి ఏదీ? తేలేది నేడే..

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో చివరి ప్లేఆఫ్స్‌ బెర్తు దక్కించుకునే జట్టు ఏదన్నది నేడు తేలిపోనుంది. ఇప్పటికే గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ వరుసగా తొలి మూడు స్థానాలతో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టాయి.

Updated : 21 May 2023 09:22 IST

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో చివరి ప్లేఆఫ్స్‌ బెర్తు దక్కించుకునే జట్టు ఏదన్నది నేడు తేలిపోనుంది. ఇప్పటికే గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ వరుసగా తొలి మూడు స్థానాలతో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టాయి. మంగళవారం తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్‌ను చెన్నై ఢీ కొడుతుంది. బుధవారం ఎలిమినేటర్‌లో లఖ్‌నవూతో తలపడే జట్టు ఏదన్నదే ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ముంబయి ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడనున్నాయి.  ఒకవేళ ముంబయి, బెంగళూరు గెలిస్తే చెరో 16 పాయింట్లతో సమానంగా ఉంటాయి. అప్పుడు మెరుగైన నెట్‌ రన్‌రేట్‌ ఉన్న జట్టు ముందంజ వేస్తుంది. ఈ రెండు జట్లలో ఒకటి ఓడి.. మరొకటి నెగ్గితే.. ఆ గెలిచిన జట్టు నేరుగా ప్లేఆఫ్స్‌ చేరుతుంది. ఒకవేళ ఈ రెండూ ఓడిపోతే.. అప్పుడు ఆర్సీబీ, రాజస్థాన్‌, ముంబయి తలో 14 పాయింట్లతో ఉంటాయి. ఇలా జరిగితే మళ్లీ నెట్‌ రన్‌రేట్‌ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని