Ambati Rayudu: చివరి మ్యాచ్‌లో రాయుడు మెరుపు షాట్లు.. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ముగింపు
అంబటి రాయుడు అదరగొట్టాడు. మెరుపు ఆటతో ముగింపుని చిరస్మరణీయం చేసుకున్నాడు. గుజరాత్‌తో ఐపీఎల్ ఫైనల్ రూపంలో తన కెరీర్‌లో ఆఖరి మ్యాచ్ ఆడిన అతడు కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చి ఉన్నంతసేపు మెరుపు షాట్లతో చెన్నైని విజయానికి చేరువ చేసి ఔటయ్యాడు.
అంబటి రాయుడు అదరగొట్టాడు. మెరుపు ఆటతో ముగింపుని చిరస్మరణీయం చేసుకున్నాడు. గుజరాత్‌తో ఐపీఎల్ ఫైనల్ రూపంలో తన కెరీర్‌లో ఆఖరి మ్యాచ్ ఆడిన అతడు కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చి ఉన్నంతసేపు మెరుపు షాట్లతో చెన్నైని విజయానికి చేరువ చేసి ఔటయ్యాడు. 25 బంతుల్లో 55 పరుగులు చేయాల్సి స్థితిలో క్రీజులోకి వచ్చిన అతడు.. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో మోహిత్ బౌలింగ్‌లో వరుసగా 6,4,6తో లక్ష్యాన్ని తేలిక చేశాడు. అతడు ఔటయ్యేసరికి చెన్నై 15 బంతుల్లో 23 పరుగులు చేయాలి. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అంబటి.. ఐపీఎల్‌కు అల్విదా చెప్పడంతో ఇక మైదానంలో కనబడడు. ఐపీఎల్‌లో 204 మ్యాచ్‌లు ఆడిన రాయుడు 4348 పరుగులు చేశాడు. 23సార్లు 50 పైన స్కోర్లు సాధించాడు. ముంబయి తరఫున మూడుసార్లు (2013, 15, 17), చెన్నై తరఫున మూడుసార్లు (2018, 2021, 2023) ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. నిందితుడి ఇంటిపైకి బుల్డోజర్..!
-
World bank: భారత వృద్ధి 6.3%.. ప్రపంచబ్యాంక్ వెల్లడి.. ద్రవ్యోల్బణ అంచనాలు పెంపు
-
Elon musk: మస్క్‌లోని ఆ లక్షణాలే వ్యాపారంలో విజయానికి.. మా విడాకులకు కారణం: జస్టిన్ మస్క్
-
Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా
-
Yashasvi: నేపాల్‌పై సెంచరీ.. శుభ్‌మన్ గిల్ రికార్డును అధిగమించిన యశస్వి
-
Nijjar Killing: నిజ్జర్ హత్య: కెనడా వాదనకు అమెరికా మద్దతు..!