Sehwag: సచిన్‌ను ఎత్తడానికి తిరస్కరించాం: సెహ్వాగ్‌

అభిమానులకు గుర్తుండే ఉంటుంది. 2011 ప్రపంచకప్‌లో విజయం అనంతరం సచిన్‌ తెందుల్కర్‌ను భుజాలకెత్తుకుని విరాట్‌ కోహ్లి మైదానమంతా తిరిగాడు. దీనికి సంబంధించి అప్పటి విజేత జట్టులో సభ్యుడు వీరేంద్ర సెహ్వాగ్‌ ఓ ఆసక్తికర విషయం చెప్పాడు.

Updated : 29 Jun 2023 08:40 IST

దిల్లీ: అభిమానులకు గుర్తుండే ఉంటుంది. 2011 ప్రపంచకప్‌లో విజయం అనంతరం సచిన్‌ తెందుల్కర్‌ను భుజాలకెత్తుకుని విరాట్‌ కోహ్లి మైదానమంతా తిరిగాడు. దీనికి సంబంధించి అప్పటి విజేత జట్టులో సభ్యుడు వీరేంద్ర సెహ్వాగ్‌ ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. అప్పుడు తాను సచిన్‌ను భుజాలకెత్తుకోవడానికి తిరస్కరించానని వెల్లడించాడు. అందుకు కారణాన్ని కూడా   వివరించాడు. ‘‘సచిన్‌ చాలా బరువు. మేం ఎత్తుకునే పరిస్థితుల్లో లేం. మా వయసు ఎక్కువ. భుజ గాయాలున్నాయి. ధోనీకి మోకాలి నొప్పి ఉంది. ఇతరులకు ఇంకేవో సమస్యలున్నాయి. అందుకే సచిన్‌ను ఎత్తుకునే పనిని కుర్రాళ్లకు అప్పగించాం. సచిన్‌ను ఎత్తుకుని స్టేడియంలో ఓ చుట్టుతిప్పమన్నాం. అందుకే కోహ్లి ఎత్తుకున్నాడు’’ అని సెహ్వాగ్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని