Praggnanandhaa: కార్ల్‌సన్‌ అజేయుడేం కాదు

ప్రపంచకప్‌ విజేత, నార్వే స్టార్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ అజేయుడేం  కాదని భారత చెస్‌ సంచలనం ప్రజ్ఞానంద అన్నాడు. ‘‘కార్ల్‌సన్‌ కచ్చితంగా బలమైన ఆటగాడు.

Updated : 04 Sep 2023 08:42 IST

కోల్‌కతా: ప్రపంచకప్‌ విజేత, నార్వే స్టార్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ అజేయుడేం  కాదని భారత చెస్‌ సంచలనం ప్రజ్ఞానంద అన్నాడు. ‘‘కార్ల్‌సన్‌ కచ్చితంగా బలమైన ఆటగాడు. కానీ అతడూ మ్యాచ్‌లు ఓడిపోతాడు. మాగ్నస్‌ అజేయుడేం  కాదు. మానసికంగా, శారీరకంగా బలంగా ఉన్నాడు కాబట్టి ఎక్కువ ఓటములు లేకుండా స్థిరంగా విజయాలు సాధిస్తున్నాడు’’ అని ప్రజ్ఞానంద పేర్కొన్నాడు. ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలవడం తన కెరీర్‌లో తొలి అడుగు అని సాధించాల్సింది చాలా ఉందన్నాడు. ‘‘చెస్‌లో నేనింకా సాధించాల్సింది చాలా ఉంది. ప్రపంచకప్‌లో ప్రదర్శన తొలి అడుగు మాత్రమే. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ నెగ్గాలంటే మానసికంగా, శారీరకంగా బలంగా ఉండాలి. నా వరకు నేను బ్యాడ్మింటన్‌ ఆడడం, వాకింగ్‌ చేయడం ద్వారా శరీరాన్ని, మనసుని ఉల్లాసంగా ఉంచుతాను’’ అని ప్రజ్ఞానంద చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని