IND vs NZ: ఆటగాళ్లు.. ఘనతలు

వన్డేల్లో వేగంగా 2000 పరుగులు సాధించిన బ్యాటర్‌గా శుభ్‌మన్‌ ఘనత సాధించాడు. గిల్‌ 38 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయి చేరుకున్నాడు.

Updated : 23 Oct 2023 09:23 IST

శుభ్‌మన్‌ వేగంగా 2000

వన్డేల్లో వేగంగా 2000 పరుగులు సాధించిన బ్యాటర్‌గా శుభ్‌మన్‌ ఘనత సాధించాడు. గిల్‌ 38 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయి చేరుకున్నాడు. హషీమ్‌ ఆమ్లా (దక్షిణాఫ్రికా, 40 ఇన్నింగ్స్‌) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.  ఆమ్లా 2011లో ఈ ఘనత సాధించాడు.


20

ఐసీసీ టోర్నీల్లో 20 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌పై భారత్‌ తొలి విజయం సాధించింది. చివరగా 2003 ప్రపంచకప్‌లో గెలిచింది.


354

ఈ ప్రపంచకప్‌లో కోహ్లి సాధించిన పరుగులు. రోహిత్‌ (311)ను దాటేశాడు.


36

వన్డే ప్రపంచకప్‌లో షమి తీసిన వికెట్లు. 12 ఇన్నింగ్స్‌ల్లోనే అతడు ఇన్ని వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు 5 వికెట్ల ప్రదర్శనలున్నాయి. భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌ అతడే.


53

ఒక క్యాలెండర్‌ ఏడాదిలో 50+ సిక్స్‌లు కొట్టిన భారత బ్యాటర్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు రోహిత్ 53 సిక్స్‌లు కొట్టాడు. ఏబీ డివిలియర్స్‌ (2015లో) 58, క్రిస్‌ గేల్ (2019లో) 56 సిక్స్‌లు బాదారు. మరో ఆరు సిక్స్‌లు కొడితే అంతర్జాతీయంగా టాప్ స్థానానికి రోహిత్ శర్మ దూసుకెళ్తాడు.


‘‘షమి అవకాశాన్ని రెండు చేతులా అందుకున్నాడు. అనుభవజ్ఞుడైన అతడు పరిస్థితులను చక్కగా ఉపయోగించుకున్నాడు. న్యూజిలాండ్‌ మంచి భాగస్వామ్యం నిర్మించి భారీ స్కోరు దిశగా సాగింది. ఆఖరికి ఆ జట్టును కట్టడి చేసిన ఘనత బౌలర్లదే. ఛేదనలో వేగంగా వికెట్లు కోల్పోవడంతో కొంత ఒత్తిడి పెరిగింది. అద్భుతంగా ఆడిన కోహ్లి, జడేజా విజయాన్ని అందించారు’’

రోహిత్‌ శర్మ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని