Sourav Ganguly: రోహిత్‌ వద్దన్నా కెప్టెన్సీ అప్పగించాం: సౌరభ్‌ గంగూలీ

భారత జట్టు పగ్గాలు చేపట్టేందుకు రోహిత్‌శర్మ విముఖత ప్రదర్శించాడని, ఎలాగైనా కెప్టెన్‌గా ఉండాల్సిందేనని అతడిని ఒప్పించామని అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ చెప్పాడు. 2021 టీ20 ప్రపంచకప్‌ తర్వాత కోహ్లి టీ20 సారథ్యం నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే.

Updated : 11 Nov 2023 08:50 IST

దిల్లీ: భారత జట్టు పగ్గాలు చేపట్టేందుకు రోహిత్‌శర్మ విముఖత ప్రదర్శించాడని, ఎలాగైనా కెప్టెన్‌గా ఉండాల్సిందేనని అతడిని ఒప్పించామని అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ చెప్పాడు. 2021 టీ20 ప్రపంచకప్‌ తర్వాత కోహ్లి టీ20 సారథ్యం నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వన్డే, టెస్టు కెప్టెన్సీకి కోహ్లి దూరమయ్యాడు. ‘‘మూడు ఫార్మాట్లలో తీరికలేని అంతర్జాతీయ క్రికెట్‌, ముంబయి ఇండియన్స్‌ సారథ్యం కారణంగా భారత జట్టు నాయకత్వ పగ్గాలు చేపట్టేందుకు రోహిత్‌ విముఖత ప్రదర్శించాడు. కానీ కోహ్లి తర్వాత అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి రోహిత్‌ సరైనోడని భావించా. అందుకు అతడిని బలవంతంగా ఒప్పించాను. నువ్వు ఒప్పుకోవాల్సిందే.. లేకపోతే నేనే ప్రకటించేస్తా అనే స్థాయి వరకు వెళ్లాం. రోహిత్‌ అద్భుతమైన కెప్టెన్‌. ప్రస్తుతం రోహిత్‌ విజయవంతమైన సారథ్యం నాకు ఆశ్చర్యం కలిగించట్లేదు’’ అని గంగూలీ వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని