ICC: ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో సెహ్వాగ్‌, ఎడుల్జీ

భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, డయానా ఎడుల్జీ.. శ్రీలంక మాజీ ఆటగాడు అరవింద డిసిల్వాకు సోమవారం ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కింది. తమ కెరీర్‌లో సాధించిన అద్భుత విజయాలకు గాను ఈ ముగ్గురికి ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది.

Updated : 14 Nov 2023 07:00 IST

దుబాయ్‌: భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, డయానా ఎడుల్జీ.. శ్రీలంక మాజీ ఆటగాడు అరవింద డిసిల్వాకు సోమవారం ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కింది. తమ కెరీర్‌లో సాధించిన అద్భుత విజయాలకు గాను ఈ ముగ్గురికి ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది. ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు సంపాదించిన భారత తొలి మహిళా క్రికెటర్‌గా ఎడుల్జీ రికార్డు సృష్టించింది. 1976-1993 మధ్యలో ఎడుల్జీ 54 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. తన ఎడమచేతి వాటం స్పిన్‌తో వందకు పైగా వికెట్లు తీసింది. 1999-2013 మధ్యలో సెహ్వాగ్‌ టెస్టుల్లో 8,586.. వన్డేల్లో 8,273 పరుగులు సాధించాడు. వన్డేల్లో 96, టెస్టుల్లో 40 వికెట్లు తీసుకున్నాడు. 1984-2003 మధ్యలో డిసిల్వా టెస్టుల్లో 6,361.. వన్డేల్లో 9,284 పరుగులు రాబట్టాడు. టెస్టుల్లో 29, వన్డేల్లో 106 వికెట్లు పడగొట్టాడు. 1996లో డిసిల్వా, 2011లో సెహ్వాగ్‌.. ప్రపంచకప్‌ విజయాల్లో కీలకపాత్ర పోషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు