IND vs NZ: బెక్‌హామ్‌ సందడి

యునిసెఫ్‌ సహృద్బావ రాయబారిగా ఉన్న బెక్‌హామ్‌.. అదే హోదాలో ఉన్న సచిన్‌తో కలిసి భారత్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు.

Updated : 16 Nov 2023 10:36 IST

యునిసెఫ్‌ సహృద్బావ రాయబారిగా ఉన్న బెక్‌హామ్‌.. అదే హోదాలో ఉన్న సచిన్‌తో కలిసి భారత్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. మ్యాచ్‌ ఆరంభానికి ముందు సచిన్‌, బెక్‌హామ్‌ మైదానంలోకి వచ్చారు. టీమ్‌ఇండియా ఆటగాళ్లు కోహ్లి తదితరులు బెక్‌హామ్‌తో కలిసి సరదాగా ఫుట్‌బాల్‌ ఆడారు.  మరోవైపు సినిమా నటీనటులు రజనీకాంత్‌, వెంకటేశ్‌, రణ్‌బీర్‌ కపూర్‌, జాన్‌ అబ్రహం, షాహిద్‌ కపూర్‌, సిద్ధార్థ్‌ మల్హోత్ర, కియారా అద్వానీ, విక్కీ కౌశల్‌, టీమ్‌ఇండియా ఆటగాళ్లు హార్దిక్‌ పాండ్య, యుజ్వేంద్ర చాహల్‌ తదితరులు స్టాండ్స్‌లో నుంచి మ్యాచ్‌ను వీక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని