Shreyas Iyer: శ్రేయస్‌ ప్రదర్శన వెనుక

ప్రపంచకప్‌లో ఆరంభ మ్యాచ్‌ల్లో శ్రేయస్‌ అయ్యర్‌ విఫలమయ్యాడు. 6 మ్యాచ్‌ల్లో ఒక్క అర్ధసెంచరీ మాత్రమే సాధించాడు. కానీ ఆ తర్వాత 4 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు బాదేశాడు.

Updated : 18 Nov 2023 10:07 IST

ప్రపంచకప్‌లో ఆరంభ మ్యాచ్‌ల్లో శ్రేయస్‌ అయ్యర్‌(Shreyas Iyer) విఫలమయ్యాడు. 6 మ్యాచ్‌ల్లో ఒక్క అర్ధసెంచరీ మాత్రమే సాధించాడు. కానీ ఆ తర్వాత 4 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు బాదేశాడు. అంతలోనే ఇంత మార్పు ఎలా? శ్రేయస్‌ జోరు వెనుక కోచ్‌లు ప్రవీణ్‌ ఆమ్రే, అభిషేక్‌ నాయర్‌ల పాత్ర ఉంది. సాంకేతిక లోపాలను దిద్దడంతో పాటు మానసిక స్థైర్యాన్ని అందించారు వీళ్లు. వాంఖడెలో శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు అయ్యర్‌.. అభిషేక్‌ నాయర్‌, ప్రవీణ్‌ ఆమ్రేల సాయం కోరాడు. వీళ్లిద్దరు మ్యాచ్‌కు ముందు అతడితో మాట్లాడారు. ‘‘శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు వరకు శ్రేయస్‌ మానసికంగా బలంగా లేడు. అయోమయ స్థితిలో ఉన్నాడు. అతడి నుంచి ఫోన్‌ రాగానే వెళ్లి మాట్లాడాను. స్టాన్స్‌ను ఎలా మార్చుకోవాలి, కొందరు బౌలర్లను ఎలా ఎదుర్కోవాలో అన్న అంశాలపై చర్చించాను. ఆ తర్వాత శ్రేయస్‌ ఆటలో మార్పు వచ్చింది. స్టాన్స్‌ ఎప్పటిలా కాకుండా కాస్త ఎడంగా పెట్టి ఆడడం వల్ల మరింత శక్తితో బంతిని కొట్టగలుగుతున్నాడు. పుల్‌ షాట్లను సులభంగా ఆడుతున్నాడు’’ అని అభిషేక్‌ చెప్పాడు. ‘‘గాయాల తాలూకా ఇబ్బందుల వల్ల శ్రేయస్‌ షాట్లను పూర్తి స్థాయిలో ఆడలేకపోతున్నాడు. అందుకే చిన్న పాటి షాట్లే ఆడేలా చూసుకోవాలి. లాంగ్‌ఆఫ్‌కు భారీ షాట్లు కొట్టాల్సిన అవసరం లేదని ఫ్లోతో ఆడాలని మాత్రమే చెప్పా’’ అని ఆమ్రే తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని