విలియమ్సన్‌ సెంచరీ

బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌ మధ్య తొలి టెస్టు నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది. ఆతిథ్య బంగ్లాదేశ్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్‌ చేసిన కివీస్‌కు.. బ్యాటుతో ఇబ్బందులు తప్పలేదు. ఎడమచేతి వాటం స్పిన్నర్‌ తైజుల్‌ ఇస్లాం (4/89) సత్తా చాటడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ 8 వికెట్లకు 266 పరుగులు సాధించింది.

Published : 30 Nov 2023 02:00 IST

న్యూజిలాండ్‌ 266/8

సిల్‌హట్‌: బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌ మధ్య తొలి టెస్టు నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది. ఆతిథ్య బంగ్లాదేశ్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్‌ చేసిన కివీస్‌కు.. బ్యాటుతో ఇబ్బందులు తప్పలేదు. ఎడమచేతి వాటం స్పిన్నర్‌ తైజుల్‌ ఇస్లాం (4/89) సత్తా చాటడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ 8 వికెట్లకు 266 పరుగులు సాధించింది. కేన్‌ విలియమ్సన్‌ (104; 205 బంతుల్లో 11×4) తన టెస్టు కెరీస్‌లో 29వ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. మిచెల్‌ (41; 54 బంతుల్లో 3×4, 1×6), గ్లెన్‌ ఫిలిప్స్‌ (42; 62 బంతుల్లో 5×4, 1×6) రాణించారు. బంగ్లా బౌలర్లలో షొరిఫుల్‌ ఇస్లాం (1/44), మెహదీ హసన్‌ (1/57), నయీం హసన్‌ (1/61), మొమినుల్‌ హక్‌ (1/2) ఒక్కో వికెట్‌ తీశారు. బంగ్లా స్కోరును అందుకోవాలంటే కివీస్‌ మరో 44 పరుగులు చేయాలి. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 310/9తో రెండో రోజు ఉదయం ఆట కొనసాగించిన బంగ్లా మొదటి బంతికే షొరిఫుల్‌ (13)ను కోల్పోయింది. దీంతో అదే స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని