Mitchell Marsh: వరల్డ్‌ కప్‌పై మళ్లీ అలాగే కాళ్లు పెడతా: మార్ష్‌

ప్రపంచకప్‌ ట్రోఫీపై కాళ్లు పెట్టి విశ్రాంతి తీసుకోవడాన్ని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ సమర్థించుకున్నాడు. కప్‌ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించలేదన్న మార్ష్‌.. మరోసారి కాళ్లు పెట్టడానికి విముఖత చూపనని తెలిపాడు.

Updated : 02 Dec 2023 07:54 IST

మెల్‌బోర్న్‌: ప్రపంచకప్‌ ట్రోఫీపై కాళ్లు పెట్టి విశ్రాంతి తీసుకోవడాన్ని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ సమర్థించుకున్నాడు. కప్‌ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించలేదన్న మార్ష్‌.. మరోసారి కాళ్లు పెట్టడానికి విముఖత చూపనని తెలిపాడు. ఫైనల్లో భారత్‌పై విజయం అనంతరం ప్రపంచకప్‌ ట్రోఫీపై మార్ష్‌ కాళ్లు పెట్టిన ఫొటో దుమారం రేపింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ‘‘ఆ ఫొటోలో ఎలాంటి అగౌరవం లేదు. దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు. సామాజిక మాధ్యమాల్ని అధికంగా చూడను. అందులో నాకెలాంటి తప్పు కనబడట్లేదు. నిజాయితీగా చెప్పాలంటే మళ్లీ అలా చేయడానికి వెనుకాడను’’ అని మార్ష్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని