టీచర్‌ అవుదామనుకొని..

రెండు చేతులు లేకపోవడంతో జీవితంలో ఏం సాధించలేనని ఒకప్పుడు అనుకున్నానని పారా ఆర్చర్‌ శీతల్‌దేవి చెప్పింది. నంబర్‌వన్‌ అయిన నేపథ్యంలో ఆమె ఇలా స్పందించింది. ‘‘జీవితంలో ఏదీ సాధించలేనని అనుకునేదాన్ని.

Published : 02 Dec 2023 03:58 IST

దిల్లీ: రెండు చేతులు లేకపోవడంతో జీవితంలో ఏం సాధించలేనని ఒకప్పుడు అనుకున్నానని పారా ఆర్చర్‌ శీతల్‌దేవి చెప్పింది. నంబర్‌వన్‌ అయిన నేపథ్యంలో ఆమె ఇలా స్పందించింది. ‘‘జీవితంలో ఏదీ సాధించలేనని అనుకునేదాన్ని. కానీ ప్రతి ఒక్కరూ ఎంతో సాయం చేశారు. అందుకే ఈ స్థితిలో నిలవగలిగా’’ అని శీతల్‌ చెప్పింది. ఒకప్పుడు ఉపాధ్యాయురాలిని కావాలనే ఆలోచన ఉండేదని కానీ.. అనుకోకుండా క్రీడల్లోకి వచ్చినట్లు పేర్కొంది. ‘‘ఉపాధ్యాయురాలిని కావాలని కోరుకునేదాన్ని. కానీ క్రీడల్లోకి వచ్చా. కోచ్‌లు అభిలాష, కుల్‌దీప్‌ ఎంతో మద్దతుగా నిలిచారు. ఇప్పుడు నా లక్ష్యమంతా భారత్‌కు ఎక్కువ పతకాలు గెలవడంపైనే ఉంది’’ అని శీతల్‌ చెప్పింది. కృత్రిమ చేతుల కోసం బెంగళూరు వెళ్లిన శీతల్‌కు ప్రీతిరాయ్‌ పరిచయం కావడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. శీతల్‌ భుజాలు కృత్రిమ చేతులు అమర్చేందుకు అనువుగా లేవని గుర్తించిన ప్రీతి.. ఆమెను భారత హాకీ జట్టు మాజీ ఫిజియో శ్రీకాంత్‌ అయ్యంగార్‌కు పరిచయం చేసింది. చేతులు లేకపోయినా శీతల్‌ కాళ్లలో ఎంతో శక్తి ఉందని గుర్తించిన శ్రీకాంత్‌.. ఆమెను ఆర్చరీ దిశగా మళ్లించాడు. ఇదే శీతల్‌ కెరీర్‌కు మలుపు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని