గెలుపు బాటలో బంగ్లా

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ గెలుపు దిశగా దూసుకెళ్తోంది. ఎడమచేతి వాటం స్పిన్నర్‌ తైజుల్‌ ఇస్లాం (4/40) ఉచ్చులో చిక్కుకున్న కివీస్‌ ఓటమి అంచుల్లో కూరుకుపోయింది.

Published : 02 Dec 2023 02:35 IST

సిల్‌హట్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ గెలుపు దిశగా దూసుకెళ్తోంది. ఎడమచేతి వాటం స్పిన్నర్‌ తైజుల్‌ ఇస్లాం (4/40) ఉచ్చులో చిక్కుకున్న కివీస్‌ ఓటమి అంచుల్లో కూరుకుపోయింది. ఓవర్‌నైట్‌ స్కోరు 212/3తో శుక్రవారం ఉదయం ఆట కొనసాగించిన బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 100.4 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ నజ్ముల్‌ హొస్సేన్‌ శాంటో (105; 198 బంతుల్లో 10×4) వ్యక్తిగత ఓవర్‌నైట్‌ స్కోరుకు ఒక్క పరుగే జోడించి ఔటవగా.. ముష్ఫికర్‌ రహీం (67; 116 బంతుల్లో 7×4), మెహదీ హసన్‌ మిరాజ్‌ (50 నాటౌట్‌; 76 బంతుల్లో 5×4) అర్ధ సెంచరీలు సాధించారు. కివీస్‌ బౌలర్లలో అజాజ్‌ పటేల్‌ (4/148), ఇష్‌ సోధి (2/74) సత్తాచాటారు. అనంతరం 332 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన కివీస్‌ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులు చేసింది. టామ్‌ లేథమ్‌ (0), డెవాన్‌ కాన్వే (22), కేన్‌ విలియమ్సన్‌ (11), హెన్రీ నికోల్స్‌ (2) విఫలమవగా.. డరైల్‌ మిచెల్‌ (44 బ్యాటింగ్‌; 86 బంతుల్లో 5×4) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. తైజుల్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. షొరిఫుల్‌ ఇస్లాం (1/13), మెహదీ హసన్‌ (1/31), నయీం హసన్‌ (1/24) ఒక్కో వికెట్‌ తీశారు. శనివారం మ్యాచ్‌కు చివరి రోజు కాగా.. విజయానికి బంగ్లా 3 వికెట్లు, కివీస్‌ 219 పరుగులు దూరంలో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు