IPL: ఐపీఎల్‌ వేలం.. 1166 మంది క్రికెటర్ల ఆసక్తి

ఐపీఎల్‌ వేలం ప్రక్రియ మొదలైంది. పది ప్రాంఛైజీలు కొంతమంది ఆటగాళ్లను వదులుకోగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు ఐపీఎల్‌ పిలుపునివ్వగా.. 1166 మంది ఆటగాళ్లు పేర్లను నమోదు చేసుకున్నారు. 77 ఖాళీలు ఉండగా..

Published : 02 Dec 2023 06:38 IST

దిల్లీ: ఐపీఎల్‌ వేలం ప్రక్రియ మొదలైంది. పది ప్రాంఛైజీలు కొంతమంది ఆటగాళ్లను వదులుకోగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు ఐపీఎల్‌ పిలుపునివ్వగా.. 1166 మంది ఆటగాళ్లు పేర్లను నమోదు చేసుకున్నారు. 77 ఖాళీలు ఉండగా.. అందులో 30 విదేశీ క్రికెటర్ల స్థానాలు. ఈసారి వేలంలో స్టార్‌ ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. వన్డే ప్రపంచకప్‌ ఆస్ట్రేలియా గెలవడంలో కీలకపాత్ర పోషించిన ట్రావిస్‌ హెడ్‌, కమిన్స్‌, స్టార్క్‌, హాజిల్‌వుడ్‌ తమ కనీస ధర రూ. 2 కోట్లుగా పేర్కొన్నారు. భారత పేసర్లు ఉమేశ్‌ యాదవ్‌, హర్షల్‌ పటేల్‌, బ్యాటర్‌ కేదార్‌ జాదవ్‌లు ఈ జాబితాలోనే ఉన్నారు. ప్రపంచకప్‌లో సత్తా చాటిన కివీస్‌ ఆల్‌రౌండర్‌ రచిన్‌ రవీంద్ర కనీస ధర రూ.50 లక్షలుగా నిర్ణయించాడు. దీని కన్నా 20 రెట్లు అధిక మొత్తానికి అతడు అమ్ముడయ్యే అవకాశాలున్నాయి. డిసెంబర్‌ 19న దుబాయ్‌లో వేలం నిర్వహించనున్నారు. 1166 మంది క్రికెటర్ల జాబితాను ఐపీఎల్‌.. ఫ్రాంఛైజీలకు పంపింది. ఇందులో ఫ్రాంఛైజీలు ఆసక్తి ప్రదర్శించిన వారితో తుది జాబితాను రూపొందిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని