Sourav Ganguly: కోహ్లీని నేను తప్పించలేదు

టీమ్‌ఇండియా టీ20 కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీని తప్పించడంలో తన పాత్రేమీ లేదని అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ పునరుద్ఘాటించాడు. టీ20 ప్రపంచకప్‌ (2021) అనంతరం కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత అతడికి, గంగూలీకి మధ్య వైరం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

Updated : 06 Dec 2023 09:47 IST

కోల్‌కతా: టీమ్‌ఇండియా టీ20 కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీని తప్పించడంలో తన పాత్రేమీ లేదని అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ పునరుద్ఘాటించాడు. టీ20 ప్రపంచకప్‌ (2021) అనంతరం కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత అతడికి, గంగూలీకి మధ్య వైరం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోహ్లి వన్డే, టెస్టు సారథిగా కూడా వైదొలిగాడు. అయితే తాను వన్డే, టెస్టు కెప్టెన్‌గా కొనసాగాలనుకున్నానని.. టీ20 కెప్టెన్‌గా వైదొలగాలనుకున్న తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని బీసీసీఐ తనను కోరలేదని అతడు చెప్పడంతో కలకలం రేగింది. ఆ వివాదంపై గంగూలీ మరోసారి స్పందించాడు. కెప్టెన్‌గా విరాట్‌ను తప్పించడంతో తనకు సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశాడు. నిజం చెప్పాలంటే టీ20 కెప్టెన్‌గా కొనసాగాలని అతణ్ని తాను కోరానని గంగూలీ చెప్పాడు. ‘‘నేను విరాట్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించలేదు. ఈ విషయం ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను. పొట్టి ఫార్మాట్లో జట్టుకు నాయకత్వం వహించాలనే ఆసక్తి అతడికి లేదు. టీ20 జట్టును నడిపించాలనే ఆసక్తి లేకపోతే మొత్తం పరిమిత ఓవర్ల సారథ్యం నుంచి   వైదొలిగితే మేలని చెప్పా’’ అని వివరించాడు. అన్ని ఫార్మాట్లలో జట్టుకు నాయకత్వం వహించడానికి రోహిత్‌ ఆసక్తి ప్రదర్శించలేదని, తాను అతణ్ని ఒప్పించానని గంగూలీ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు