junior hockey wc: అర్జీత్‌ హ్యాట్రిక్‌

జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు అదిరే ఆరంభం. అర్జీత్‌ సింగ్‌ హుందాల్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌ కొట్టడంతో మంగళవారం పూల్‌-సి మ్యాచ్‌లో 4-2తో కొరియాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి భారత్‌దే జోరు. 11వ నిమిషంలో అర్జీత్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు.

Updated : 06 Dec 2023 09:40 IST

భారత్‌ శుభారంభం
జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌

కౌలాలంపూర్‌: జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు అదిరే ఆరంభం. అర్జీత్‌ సింగ్‌ హుందాల్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌ కొట్టడంతో మంగళవారం పూల్‌-సి మ్యాచ్‌లో 4-2తో కొరియాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి భారత్‌దే జోరు. 11వ నిమిషంలో అర్జీత్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. రెండో క్వార్టర్‌లో భారత్‌ ఖాతాలో మరో రెండు గోల్స్‌ పడ్డాయి. అర్జీత్‌ (16వ), అమన్‌దీప్‌ (30వ) బంతిని లక్ష్యానికి చేర్చారు. కానీ మూడో క్వార్టర్‌లో కొరియా కాస్త పుంజుకుంది. లిమ్‌ (38వ) చేసిన గోల్‌తో ఖాతా తెరిచింది. వారి ఆనందం కాసేపే. స్వల్ప వ్యవధిలోనే అర్జీత్‌ (41వ) హ్యాట్రిక్‌ గోల్‌ కొట్టడంతో భారత్‌ 4-1తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. కొరియా ఆటగాడు మింక్‌వాన్‌ (45వ) గోల్‌ చేసినా.. ఆ తర్వాత భారత్‌ మరో అవకాశం ఇవ్వకుండా విజయాన్ని సొంతం చేసుకుంది. భారత్‌ గురువారం స్పెయిన్‌తో తలపడనుంది.
న్యూజిలాండ్‌పై భారత మహిళల విజయం: జూనియర్‌ మహిళల ప్రపంచకప్‌లో నామమాత్రమైన వర్గీకరణ మ్యాచ్‌ (9వ-16వ)లో భారత్‌ పెనాల్టీ షూటౌట్లో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. నిర్ణీత సమయంలో రెండు జట్లు 3-3తో సమంగా నిలిచాయి. భారత్‌ తరఫున రూప్ని కుమారి (8వ), జ్యోతి ఛెత్రి (17వ), సునేలితా తొప్పో (53వ) గోల్స్‌ కొట్టారు. న్యూజిలాండ్‌ తరఫున ఇసాబెలా స్టోరీ (11వ), మదెలిన్‌ హారిస్‌ (14వ), రైనా ఫో (49వ) తలో గోల్‌ సాధించారు. పెనాల్టీ షూటౌట్లో భారత్‌ 3-2తో పైచేయి సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని