Pro Kabaddi League: విజృంభించిన సోను

రైడర్‌ సోను జగ్లాన్‌ (10 పాయింట్లు) అదరగొట్టడంతో ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-10లో గుజరాత్‌ జెయింట్స్‌ హ్యాట్రిక్‌ సాధించింది. జోరు కొనసాగిస్తూ మంగళవారం 39-37లో యు ముంబాపై విజయం సాధించింది. మలుపులు తిరుగుతూ ఉత్కంఠ రేపుతూ సాగిన ఈ పోరులో ఆరంభంలో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది.

Updated : 06 Dec 2023 09:38 IST

గుజరాత్‌ హ్యాట్రిక్‌
ప్రొ కబడ్డీ లీగ్‌

అహ్మదాబాద్‌ : రైడర్‌ సోను జగ్లాన్‌ (10 పాయింట్లు) అదరగొట్టడంతో ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-10లో గుజరాత్‌ జెయింట్స్‌ హ్యాట్రిక్‌ సాధించింది. జోరు కొనసాగిస్తూ మంగళవారం 39-37లో యు ముంబాపై విజయం సాధించింది. మలుపులు తిరుగుతూ ఉత్కంఠ రేపుతూ సాగిన ఈ పోరులో ఆరంభంలో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. గుజరాత్‌ తరఫున సోను.. ముంబా జట్టులో గమాన్‌ సింగ్‌ రాణించడంతో పోటీ నువ్వానేనా అన్నట్లు సాగింది. ఒక దశలో ముంబా 7-5తో ఆధిక్యంలోకి వెళ్లింది. మహేందర్‌సింగ్‌ సూపర్‌ ట్యాకిల్‌ చేయడంతో 12-10తో నిలిచిన ముంబా.. విరామ సమయానికి 18-16 ఆధిక్యాన్ని దక్కించుకుంది. కానీ ఆ తర్వాత గుజరాత్‌ పుంజుకుంది. సోను విజృంభించడంతో స్కోరు సమం చేసింది. అంతేకాదు ముంబాను ఆలౌట్‌ చేసి 23-19తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే మరోవైపు ముంబా పట్టువదల్లేదు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ పాయింట్లు  కొల్లగొట్టింది. జాఫర్‌ మెరుపులతో గుజరాత్‌ను ఆలౌట్‌ చేసిన ముంబా.. 34-34 స్కోరు సమం చేసింది. మ్యాచ్‌ హోరాహోరీగా సాగుతున్న దశలో సూపర్‌ రైడ్‌తో మూడు పాయింట్లు తెచ్చిన  సోను.. గుజరాత్‌ను విజయపథంలో నడిపించాడు. గుజరాత్‌ జట్టులో సోనుతో పాటు రాకేశ్‌ (9), రోహిత్‌ గులియా(7) కూడా రాణించారు. ముంబాలో గమాన్‌ (10), జాఫర్‌ (10) ఆకట్టుకున్నారు.

ప్రొ కబడ్డీలో ఈనాడు

తెలుగు టైటాన్స్‌ × పట్నా పైరేట్స్‌    (రా. 8 నుంచి)
యూపీ యోధాస్‌ × హరియాణా స్టీలర్స్‌   (రా. 9 నుంచి)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని