Ravi Bishnoi: టీ20ల్లో బిష్ణోయ్‌ నంబర్‌వన్‌

భారత యువ లెగ్‌స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ టీ20 క్రికెట్లో నంబర్‌వన్‌ బౌలర్‌గా అవతరించాడు. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో  అగ్రస్థానంలో నిలిచాడు. చక్కని ప్రదర్శనతో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డును అందుకున్న 23 ఏళ్ల బిష్ణోయ్‌.

Updated : 07 Dec 2023 09:42 IST

దుబాయ్‌: భారత యువ లెగ్‌స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ టీ20 క్రికెట్లో నంబర్‌వన్‌ బౌలర్‌గా అవతరించాడు. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో  అగ్రస్థానంలో నిలిచాడు. చక్కని ప్రదర్శనతో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డును అందుకున్న 23 ఏళ్ల బిష్ణోయ్‌.. అయిదు స్థానాలు ఎగబాకాడు. ఆసీస్‌పై అయిదు మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టిన అతడు ప్రస్తుతం 699 పాయింట్లతో ఉన్నాడు. అఫ్గానిస్థాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (692)ను రెండో స్థానానికి నెట్టాడు. శ్రీలంక స్పిన్నర్‌ వహిందు హసరంగ, ఇంగ్లాండ్‌కు చెందిన అదిల్‌ రషీద్‌ 679 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. భారత్‌ నుంచి బిష్ణోయ్‌ మాత్రమే టాప్‌-10 బౌలర్ల జాబితాలో ఉన్నాడు. అక్షర్‌ పటేల్‌ 18వ స్థానంలో నిలిచాడు. బ్యాటర్ల జాబితాలో సూర్యకుమార్‌ యాదవ్‌ నంబర్‌వన్‌ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రుతురాజ్‌ ఒక స్థానం కోల్పోయి ఏడో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు దూరమైనప్పటికీ ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్‌ పాండ్య మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టు, వన్డే, టీ20 టీమ్‌ ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని