అజిత్‌కు రెండో స్థానం

అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్‌) గ్రాండ్‌ప్రి-2 వెయిట్‌లిఫ్టింగ్‌ ఈవెంట్లో నారాయణ్‌ అజిత్‌ (73 కేజీ) గ్రూప్‌-సిలో రెండో స్థానంలో నిలిచాడు.

Published : 08 Dec 2023 01:59 IST

గ్రాండ్‌ప్రి వెయిట్‌లిఫ్టింగ్‌

దోహా: అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్‌) గ్రాండ్‌ప్రి-2 వెయిట్‌లిఫ్టింగ్‌ ఈవెంట్లో నారాయణ్‌ అజిత్‌ (73 కేజీ) గ్రూప్‌-సిలో రెండో స్థానంలో నిలిచాడు. స్నాచ్‌లో 133 కేజీలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 157 కేజీలు ఎత్తిన అజిత్‌.. మొత్తం 290 కేజీలతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. మొత్తం అన్ని గ్రూప్‌ల్లో పోటీలు ముగిశాక తుది జాబితాను వెల్లడిస్తారు. 73 కేజీల్లోనే అచింత షూలి.. గ్రూప్‌-బిలో బరిలో దిగుతున్నాడు. మరోవైపు కామన్వెల్త్‌ రజత పతక విజేత బింద్యారాణి (55 కేజీ) నిరాశపరిచింది. క్లీన్‌ అండ్‌ జర్క్‌లో మూడు ప్రయత్నాల్లోనూ ఆమె అనుకున్న బరువును ఎత్తలేకపోయింది. మొదట 106 కేజీలు లిఫ్ట్‌ చేయలేకపోయిన బింద్యా.. ఆ తర్వాత రెండు ప్రయత్నాల్లో 109 కేజీలు ఎత్తాలనుకుని విఫలమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని