విజృంభించిన కరన్‌, లివింగ్‌స్టన్‌

వెస్టిండీస్‌తో తొలి వన్డేలో ఓడిన ఇంగ్లాండ్‌ పుంజుకుంది. సామ్‌ కరన్‌ (3/33), లివింగ్‌స్టన్‌ (3/39) విజృంభించడంతో రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలిచి మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

Published : 08 Dec 2023 02:06 IST

రెండో వన్డేలో ఇంగ్లాండ్‌ గెలుపు

నార్త్‌ సౌండ్‌ (ఆంటిగ్వా): వెస్టిండీస్‌తో తొలి వన్డేలో ఓడిన ఇంగ్లాండ్‌ పుంజుకుంది. సామ్‌ కరన్‌ (3/33), లివింగ్‌స్టన్‌ (3/39) విజృంభించడంతో రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలిచి మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మొదట కరన్‌, లివింగ్‌స్టన్‌ దెబ్బకు విండీస్‌ 39.4 ఓవర్లలో 202 పరుగులకే ఆలౌటైంది. ఒక దశలో 23/4తో ఇబ్బందుల్లో పడిన విండీస్‌ను కెప్టెన్‌ షై హోప్‌ (68).. రూథర్‌ఫోర్డ్‌ (63)తో కలిసి ఆదుకున్నాడు. ఈ జోడీ అయిదో వికెట్‌కు 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో విండీస్‌ 29.3 ఓవర్లలో 152/4తో మెరుగైన స్థితిలో కనిపించింది. అయితే ఇంగ్లాండ్‌ బౌలర్ల దెబ్బకు 50 పరుగుల తేడాతో 6 వికెట్లు కోల్పోయి అనుకున్నదాని కంటే తక్కువ స్కోరుకే ఆలౌటైంది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో అట్కిన్సన్‌ (2/28), రెహాన్‌ అహ్మద్‌ (2/40) కూడా రాణించారు. లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ 32.5 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి అందుకుంది. విల్‌ జాక్స్‌ (73; 72 బంతుల్లో 6×4, 4×6) రాణించాడు. అతడు వెనుదిరిగినా.. కెప్టెన్‌ బట్లర్‌ (58 నాటౌట్‌), బ్రూక్‌ (43 నాటౌట్‌) ఇంగ్లాండ్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ జోడీ అబేధ్యమైన అయిదో వికెట్‌కు 90 పరుగులు జత చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని