IPL: ఐపీఎల్‌ వేలానికి 333మంది క్రికెటర్లు

ఈ నెల 19న జరిగే ఐపీఎల్‌ వేలంలో మొత్తం 333 మంది అమ్మకానికి ఉంటారు. ఖాళీలు 77 మాత్రమే. హర్షల్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఉమేశ్‌ యాదవ్‌ కనీస ధర   రూ.2 కోట్లు ఉన్న ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు.

Published : 12 Dec 2023 08:17 IST

దిల్లీ: ఈ నెల 19న జరిగే ఐపీఎల్‌ (IPL) వేలంలో మొత్తం 333 మంది అమ్మకానికి ఉంటారు. ఖాళీలు 77 మాత్రమే. హర్షల్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఉమేశ్‌ యాదవ్‌ కనీస ధర రూ.2 కోట్లు ఉన్న ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. రెండేళ్ల కింద జరిగిన వేలంలో హర్షల్‌ రూ.10.75 కోట్లకు అమ్ముడుపోయాడు. ఐపీఎల్‌ పాలకవర్గం మొత్తం 1166 మందితో కూడిన జాబితాను ఫ్రాంఛైజీలకు అందించింది. ఆటగాళ్లపై ఫ్రాంఛైజీల ఆసక్తి ఆధారంగా జాబితాను 333కు కుదించింది. ఇందులో 214 మంది భారతీయులు, 119 మంది విదేశీయులు, అసోసియేట్‌ దేశాల నుంచి ఇద్దరు ఉన్నారు. వేలంలో ఖర్చు పెట్టడానికి ఫ్రాంఛైజీల వద్ద మొత్తం రూ.262.95 కోట్లు ఉన్నాయి. మొత్తం 77 మంది నుంచి గరిష్టంగా 30 మంది విదేశీ క్రికెటర్లను జట్లు కొనుక్కోవచ్చు. ఆసీస్‌ ఆటగాళ్లు కమిన్స్‌, ట్రావిస్‌ హెడ్‌, ఇంగ్లిస్‌, మిచెల్‌ స్టార్క్‌లకు మంచి డిమాండ్‌ ఉండనుంది. వీళ్ల కనీస ధర రూ.2 కోట్లు. న్యూజిలాండ్‌ స్టార్‌ రచిన్‌ రవీంద్ర తన కనీస ధరను రూ.50 లక్షలుగా నిర్ణయించుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని