BCCI: ఐపీఎల్‌ తరహాలో మరో లీగ్‌

ఐపీఎల్‌ తరహాలో మరో లీగ్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది సెప్టెంబరు- అక్టోబరులో ఐపీఎల్‌ టైయర్‌-2 లీగ్‌ అరంగేట్రం చేయొచ్చు.

Published : 16 Dec 2023 09:06 IST

దిల్లీ: ఐపీఎల్‌ తరహాలో మరో లీగ్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది సెప్టెంబరు- అక్టోబరులో ఐపీఎల్‌ టైయర్‌-2 లీగ్‌ అరంగేట్రం చేయొచ్చు. అయితే ఈ లీగ్‌ను టీ10 ఫార్మాట్లో నిర్వహించాలా? లేదా టీ20 పద్ధతిలో చేపట్టాలా? అన్న విషయంలో బోర్డు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఐపీఎల్‌ ప్రయోజనాలకు విఘాతం కలగకుండా వయో పరిమితి విధించాలన్న ఆలోచన కూడా ఉంది. ఐపీఎల్‌ ఫ్రాంచైజీలతో సంప్రదింపుల తర్వాత బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు