Gautam Gambhir: జైస్వాల్‌ను ఆకాశానికెత్తొద్దు: గంభీర్‌

యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ తన ఆట తనను ఆడుకోనివ్వాలని.. ఘనతలను ఎక్కువ చేసి చూపించడం వల్ల ఒత్తిడి పెరుగుతుందని మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ హెచ్చరించాడు.

Updated : 04 Feb 2024 08:12 IST

దిల్లీ: యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ తన ఆట తనను ఆడుకోనివ్వాలని.. ఘనతలను ఎక్కువ చేసి చూపించడం వల్ల ఒత్తిడి పెరుగుతుందని మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ హెచ్చరించాడు. ‘‘ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో డబుల్‌ సెంచరీ చేసిన యశస్వికి అభినందనలు. తన ఆట తనను ఆడుకోనివ్వండి. లేకపోతే ఒత్తిడి పెరిగి సహజత్వం దెబ్బ తింటుంది. గతంలోనూ ఇలా మీడియా కొందరి ఘనతలను ఎక్కువ చేసి చూపించింది. వారికి ట్యాగ్‌లు ఇచ్చి ఒత్తిడి పెంచింది. దీంతో అంచనాలను అందుకోలేక కెరీర్‌లు ఇబ్బందుల్లో పడ్డాయి’’ అని గౌతి గుర్తు చేశాడు. రెండో టెస్టులో శుభ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ బాగానే ఆరంభించినా పెద్ద స్కోర్లు చేయలేకపోయారని.. వారు గాడిలో పడటానికి సమయం పడుతుందని పేర్కొన్నాడు. ‘‘శుభ్‌మన్‌, శ్రేయస్‌ నాణ్యమైన బ్యాటర్లు. వారికి సమయం ఇవ్వాలి. గతంలోనూ ఇలానే పుంజుకున్నారు. అందుకే ఇంకా భారత్‌కు ఆడుతున్నారు’’ అని గంభీర్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని