U19 World Cup Final : మనోడే దెబ్బ కొట్టాడు

ప్రపంచకప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా ఓటమికి హర్జాస్‌ సింగ్‌ ఓ ప్రధాన కారణం. బ్యాటింగ్‌లో అర్ధశతకంతో జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు.

Updated : 12 Feb 2024 07:54 IST

ప్రపంచకప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా ఓటమికి హర్జాస్‌ సింగ్‌ ఓ ప్రధాన కారణం. బ్యాటింగ్‌లో అర్ధశతకంతో జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. అయితే ఈ హర్జాస్‌ సింగ్‌ భారత సంతతికి చెందినవాడే. అతని మూలాలు పంజాబ్‌లోని చండీగఢ్‌లో ఉన్నాయి. హర్జాస్‌ తండ్రి ఇందర్‌జిత్‌ సింగ్‌ రాష్ట్ర బాక్సింగ్‌ ఛాంపియన్‌. తల్లి అవిందర్‌ కౌర్‌ రాష్ట్రస్థాయి లాంగ్‌జంప్‌ అథ్లెట్‌. ఇందర్‌జిత్‌ కుటుంబం 2000లో ఆస్ట్రేలియాకు వలస వెళ్లింది. 2005లో సిడ్నీలో హర్జాస్‌ పుట్టాడు. రెవెస్బీ వర్కర్స్‌ క్రికెట్‌ క్లబ్‌లో 8 ఏళ్ల వయసులో కెరీర్‌ ప్రారంభించాడు. ఈ ప్రపంచకప్‌లో ఫైనల్‌ ముందు వరకూ అతను గొప్పగా రాణించింది లేదు. ఈ మ్యాచ్‌కు ముందు అతని అత్యధిక స్కోరు 17 పరుగులే. ఆరు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 49 పరుగులే చేశాడు. కానీ కీలకమైన పోరులో మాత్రం 55 పరుగుల ఇన్నింగ్స్‌తో భారత్‌ను దెబ్బకొట్టాడు. ఎడమ చేతి వాటం బ్యాటర్‌ అయిన అతను కుడి చేతి వాటం పేసర్‌ కూడా. శ్రీలంకపై ఓ వికెట్‌ కూడా సాధించాడు. ఇప్పటికీ అతని బంధువులు పంజాబ్‌లో ఉన్నారు. చివరగా అతను 2015లో భారత్‌కు వచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని