ఫైనల్లో ధీరజ్‌ బృందం

ఆసియాకప్‌ ఆర్చరీ లెగ్‌-1లో తెలుగుతేజం బొమ్మదేవర ధీరజ్‌ బృందం ఫైనల్లో ప్రవేశించింది. మంగళవారం పురుషుల రికర్వ్‌ టీమ్‌ విభాగంలో ధీరజ్‌, ప్రవీణ్‌ జాదవ్‌, తరుణ్‌దీప్‌ రాయ్‌లతో కూడిన భారత జట్టు సెమీస్‌లో 6-0తో ఇరాన్‌ను చిత్తు చేసింది.

Published : 23 Feb 2024 01:59 IST

బాగ్దాద్‌: ఆసియాకప్‌ ఆర్చరీ లెగ్‌-1లో తెలుగుతేజం బొమ్మదేవర ధీరజ్‌ బృందం ఫైనల్లో ప్రవేశించింది. మంగళవారం పురుషుల రికర్వ్‌ టీమ్‌ విభాగంలో ధీరజ్‌, ప్రవీణ్‌ జాదవ్‌, తరుణ్‌దీప్‌ రాయ్‌లతో కూడిన భారత జట్టు సెమీస్‌లో 6-0తో ఇరాన్‌ను చిత్తు చేసింది. స్వర్ణ పోరులో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. రికర్వ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌లో సిమ్రన్‌జీత్‌ కౌర్‌తో కలిసి ధీరజ్‌ తుదిపోరుకు అర్హత సాధించాడు. సెమీస్‌లో ధీరజ్‌ జంట 6-2తో ఖతార్‌ను ఓడించింది. మహిళల రికర్వ్‌ జట్టు (దీపిక, సిమ్రన్‌, భజన్‌ కౌర్‌) 6-0తో ఇరాక్‌ను.. కాంపౌండ్‌ మహిళల టీమ్‌ (అదితి, ప్రియ, పర్ణీత్‌) 234-210తో అఫ్గానిస్థాన్‌ను ఓడించి ఫైనల్‌ చేరాయి. కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌లో బంగ్లాదేశ్‌, కాంపౌండ్‌ పురుషుల టీమ్‌లో ఇరాక్‌పై నెగ్గి భారత్‌ ముందంజ వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని