తొలి అర్ధభాగంలో బ్యాటర్‌గానే..

ఘోర రోడ్డు ప్రమాదం తర్వాత కోలుకుని ఐపీఎల్‌-17తో పునరాగమనం చేయబోతున్న స్టార్‌ ఆటగాడు రిషబ్‌ పంత్‌ ఈ టోర్నీలో తొలి అర్ధభాగంలో కేవలం బ్యాటర్‌గా మాత్రమే ఆడబోతున్నాడు.

Published : 24 Feb 2024 03:37 IST

దిల్లీ: ఘోర రోడ్డు ప్రమాదం తర్వాత కోలుకుని ఐపీఎల్‌-17తో పునరాగమనం చేయబోతున్న స్టార్‌ ఆటగాడు రిషబ్‌ పంత్‌ ఈ టోర్నీలో తొలి అర్ధభాగంలో కేవలం బ్యాటర్‌గా మాత్రమే ఆడబోతున్నాడు. అతడు దిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహించడంతో పాటు బ్యాటింగ్‌ చేస్తాడని, వికెట్‌ కీపింగ్‌చేయడని ఫ్రాంఛైజీ సహ యజమాని పార్థ్‌ జిందాల్‌ చెప్పాడు. ‘‘రిషబ్‌ బ్యాటింగ్‌, వికెట్‌కీపింగ్‌ సాధన చేస్తున్నాడు. ఐపీఎల్‌లో ఆడేంత ఫిట్‌గా కనిపిస్తున్నాడు. తొలి మ్యాచ్‌ నుంచే పంత్‌ దిల్లీకి కెప్టెన్సీ చేస్తాడు. తొలి ఏడు మ్యాచ్‌లు కేవలం బ్యాటర్‌గానే ఆడిస్తాం. పరిస్థితిని బట్టి ఆ తర్వాత అతడి పాత్ర గురించి ఆలోచిస్తాం’’ అని జిందాల్‌ తెలిపాడు. 2022 డిసెంబర్‌ 30న చివరిగా బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడిన పంత్‌.. కొన్ని రోజుల తర్వాత రోడ్డు ప్రమాదానికి గురై శస్త్ర చికిత్సలు చేయించుకున్నాడు. గాయాలు మానాక జాతీయ క్రికెట్‌ అకాడమీలో మళ్లీ ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. ఇటీవల ఓ టీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ కూడా చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని