టీ20 సిరీస్‌ ఆసీస్‌దే

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి మరో టీ20 మిగిలుండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. శుక్రవారం రెండో టీ20లో ఆసీస్‌ 72 పరుగుల తేడాతో నెగ్గింది.

Published : 24 Feb 2024 03:38 IST

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి మరో టీ20 మిగిలుండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. శుక్రవారం రెండో టీ20లో ఆసీస్‌ 72 పరుగుల తేడాతో నెగ్గింది. మొదట ఆసీస్‌ 19.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్‌ హెడ్‌ (45; 22 బంతుల్లో 2×4, 5×6), కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ (26; 21 బంతుల్లో 1×4, 2×6), ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పాట్‌ కమిన్స్‌ (28; 22 బంతుల్లో 5×4) రాణించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. కివీస్‌ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్‌ (4/12), ఆడమ్‌ మిల్నే (2/40), బెన్‌ సియర్స్‌ (2/29), మిచెల్‌ సాంట్నర్‌ (2/35) మెరిశారు. అనంతరం కివీస్‌ 17 ఓవర్లలో 102 పరుగులకే కుప్పకూలింది. గ్లెన్‌ ఫిలిప్స్‌ (42; 35 బంతుల్లో 3×4, 2×6) పోరాడినా ఫలితం లేకపోయింది. ఆడమ్‌ జంపా (4/34), నాథన్‌ ఎలిస్‌ (2/16) ఆ జట్టును దెబ్బ తీశారు. చివరి టీ20 ఆదివారం జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని