ఆమీర్‌ను కలిసిన సచిన్‌

రెండు చేతులు లేకపోయినా క్రికెట్‌ ఆడుతూ అందరికి స్ఫూర్తిగా నిలిచిన జమ్ము కశ్మీర్‌ కుర్రాడు ఆమీర్‌ హుస్సేన్‌ను దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందుల్కర్‌ కలిశాడు.

Published : 25 Feb 2024 04:22 IST

శ్రీనగర్‌: రెండు చేతులు లేకపోయినా క్రికెట్‌ ఆడుతూ అందరికి స్ఫూర్తిగా నిలిచిన జమ్ము కశ్మీర్‌ కుర్రాడు ఆమీర్‌ హుస్సేన్‌ను దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందుల్కర్‌ కలిశాడు. కశ్మీర్‌ పర్యటనలో ఉన్న సచిన్‌.. పారా క్రికెటర్‌ ఆమీర్‌ను కలిసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ‘‘ఆమీర్‌ నిజమైన హీరో. ఇలాగే అందరికి స్ఫూర్తి ఇవ్వాలి. అతడిని కలవడం చాలా సంతోషంగా ఉంది’’ అని తెందుల్కర్‌ వ్యాఖ్య జోడించాడు. ఆమీర్‌తో చాలాసేపు ముచ్చటించిన సచిన్‌.. ఆటోగ్రాఫ్‌ చేసిన బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చాడు. చేతులు లేకుండా తాను ఎలా ఆడతానో సచిన్‌కు ఆమీర్‌ చూపించాడు. ఇటీవల ఆమీర్‌ క్రికెట్‌ ఆడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతం కావడంతో అతడిని కలవాలని ఉందని తెందుల్కర్‌ గతంలో తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని