మెరిసిన సౌమ్య

తెలుగమ్మాయి సౌమ్య గుగులోత్‌ కీలక సమయంలో గోల్‌ కొట్టడంతో టర్కీష్‌ మహిళల కప్‌లో భారత్‌ 2-0తో హాంకాంగ్‌ను ఓడించింది.

Published : 25 Feb 2024 04:23 IST

హాంకాంగ్‌పై భారత్‌ గెలుపు

అలన్యా (టర్కీ): తెలుగమ్మాయి సౌమ్య గుగులోత్‌ కీలక సమయంలో గోల్‌ కొట్టడంతో టర్కీష్‌ మహిళల కప్‌లో భారత్‌ 2-0తో హాంకాంగ్‌ను ఓడించింది. 19వ నిమిషంలో అంజు తమాంగ్‌ స్కోరు చేయడంతో ఆధిక్యంలోకి వెళ్లిన భారత్‌.. సౌమ్య (79వ) బంతిని నెట్‌లోకి పంపడంతో విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ టోర్నీలో రెండో గెలుపుతో ఆరు పాయింట్లతో భారత్‌ రెండో స్థానంలో ఉంది. ఇన్నే పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న కొసావోతో మంగళవారం భారత్‌ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టైటిల్‌ సొంతమవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని