Sunil Gavaskar: కోహ్లి ఐపీఎల్‌ అయినా ఆడతాడా..?

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన కోహ్లి త్వరలోనే ఐపీఎల్‌ ఆడనున్నాడు. విరామం తర్వాత ఆడుతున్న అతడు పరుగుల దాహంతో ఉంటాడా..?

Updated : 27 Feb 2024 07:23 IST

రాంచి: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన కోహ్లి త్వరలోనే ఐపీఎల్‌ ఆడనున్నాడు. విరామం తర్వాత ఆడుతున్న అతడు పరుగుల దాహంతో ఉంటాడా..? సోమవారం ఓ కార్యక్రమంలో దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌కు ఎదురైన ప్రశ్న ఇది. దీనికి గావస్కర్‌ వ్యంగ్యంగా స్పందించాడు. ‘‘ఏవో కారణాలతో అతను ఆడట్లేదు. ఐపీఎల్‌ అయినా ఆడతాడా..? ఐపీఎల్‌ కూడా ఆడడేమో’’ అని అన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని