షమికి శస్త్రచికిత్స

టీమ్‌ఇండియా సీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమి.. దీర్ఘ కాలంగా ఇబ్బంది పెడుతున్న తన కుడి కాలి చీలమండకు లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అతను కనీసం మూడు నెలలు మైదానానికి దూరం కానున్నాడు.

Published : 28 Feb 2024 01:50 IST

దిల్లీ: టీమ్‌ఇండియా సీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమి.. దీర్ఘ కాలంగా ఇబ్బంది పెడుతున్న తన కుడి కాలి చీలమండకు లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అతను కనీసం మూడు నెలలు మైదానానికి దూరం కానున్నాడు. దీంతో అనుకున్నట్లే ఈ ఐపీఎల్‌ సీజన్‌ మొత్తానికి షమి అందుబాటులో లేకుండా పోయాడు. షమి చివరగా.. గత ఏడాది నవంబరు 19న వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆడాడు. జూన్‌లో మొదలయ్యే టీ20 ప్రపంచకప్‌లో అతను పునరాగమనం చేస్తాడని భావిస్తున్నారు. ఐపీఎల్‌లో గత రెండు సీజన్లలో గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున షమి గొప్పగా రాణించాడు. తన తొలి సీజన్లోనే టైటాన్స్‌ టైటిల్‌ గెలవడం, తర్వాతి ఏడాది రన్నరప్‌గా నిలవడంలో షమిది కీలక పాత్ర. ఇప్పటికే కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యను దూరం చేసుకున్న టైటాన్స్‌కు షమి కూడా అందుబాటులో లేకపోవడం గట్టి దెబ్బే. ఈ సీజన్లో ఆ జట్టు ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ నేతృత్వంలో బరిలోకి దిగుతోంది. మరోవైపు చీలమండకు శస్త్రచికిత్స చేయించుకున్న షమి త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని