33 బంతుల్లోనే శతకం

నమీబియా బ్యాటర్‌ జాన్‌ లాఫ్టీ ఈటన్‌ (101; 36 బంతుల్లో 11×4, 8×6) అదరగొట్టాడు. ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా నేపాల్‌తో తొలి మ్యాచ్‌లో కేవలం 33 బంతుల్లోనే సెంచరీ సాధించి కుశాల్‌ మల్లా (నేపాల్‌, 34 బంతుల్లో)...

Published : 28 Feb 2024 01:55 IST

టీ20ల్లో లాఫ్టీ రికార్డు శతకం

కీర్తిపుర్‌: నమీబియా బ్యాటర్‌ జాన్‌ లాఫ్టీ ఈటన్‌ (101; 36 బంతుల్లో 11×4, 8×6) అదరగొట్టాడు. ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా నేపాల్‌తో తొలి మ్యాచ్‌లో కేవలం 33 బంతుల్లోనే సెంచరీ సాధించి కుశాల్‌ మల్లా (నేపాల్‌, 34 బంతుల్లో) పేరిట ఉన్న వేగవంతమైన శతకం రికార్డును బద్దలు కొట్టాడు. 18 బంతుల్లోనే అర్ధసెంచరీ అందుకున్న ఈ కుర్రాడు.. ఆ తర్వాత కేవలం 15 బంతుల్లోనే సెంచరీ మార్కు చేరుకోవడం విశేషం. అతడి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. ఇప్పటిదాకా 33 టీ20లు, 36 వన్డేలు ఆడిన ఈ 22 ఏళ్ల బ్యాటర్‌కు ఇదే తొలి శతకం. లాఫ్టీ మెరుపు సెంచరీతో నమీబియా 4 వికెట్లకు 206 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో నేపాల్‌ 18.5 ఓవర్లలో 186కే ఆలౌటైంది. ఈ ముక్కోణపు సిరీస్‌లో ఆడుతున్న మూడో జట్టు నెదర్లాండ్స్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని