కూత.. ఆఖరికొచ్చింది

ప్రొ కబడ్డీ సీజన్‌-10 ఆఖరి అంకానికి చేరింది. ఇక ఈ టోర్నీలో మిగిలింది మూడు మ్యాచ్‌లే. గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం పట్నా పైరేట్స్‌తో పుణెరి పల్టాన్‌...

Published : 28 Feb 2024 01:59 IST

నేడే ప్రొ కబడ్డీ సెమీస్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ సీజన్‌-10 ఆఖరి అంకానికి చేరింది. ఇక ఈ టోర్నీలో మిగిలింది మూడు మ్యాచ్‌లే. గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం పట్నా పైరేట్స్‌తో పుణెరి పల్టాన్‌... జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌తో హరియాణా స్టీలర్స్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. లీగ్‌ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పుణెరి పల్టాన్‌ (96 పాయింట్లు), జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌ (92) నేరుగా సెమీఫైనల్‌ చేరాయి. ఎలిమినేటర్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ను హరియాణా స్టీలర్స్‌.. దబంగ్‌ దిల్లీపై పట్నా పైరేట్స్‌ గెలిచి సెమీస్‌కు అర్హత సాధించాయి. సెమీస్‌లో రాత్రి 8 గంటలకు పుణెరి-పట్నా, 9కి జైపుర్‌-హరియాణా పోటీపడబోతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని