జైస్వాల్‌ @ 12

భారత యువ బ్యాటింగ్‌ సంచలనం యశస్వి జైస్వాల్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మరింత పురోగతి సాధించాడు. బుధవారం ప్రకటించిన ఐసీసీ టెస్టు బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో జైస్వాల్‌ 12వ స్థానంలో నిలిచాడు.

Updated : 29 Feb 2024 03:52 IST

దుబాయ్‌: భారత యువ బ్యాటింగ్‌ సంచలనం యశస్వి జైస్వాల్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మరింత పురోగతి సాధించాడు. బుధవారం ప్రకటించిన ఐసీసీ టెస్టు బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో జైస్వాల్‌ 12వ స్థానంలో నిలిచాడు. విరాట్‌ కోహ్లి 9, రోహిత్‌శర్మ 13వ ర్యాంకులు సాధించారు. యువ వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌ 31 స్థానాలు మెరుగై 69వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. బౌలింగ్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా, రవిచంద్రన్‌ అశ్విన్‌ వరుసగా తొలి రెండు ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. రవీంద్ర జడేజా ఆరో స్థానంలో ఉన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని