గాయత్రి జంట శుభారంభం

జర్మనీ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ జంట శుభారంభం చేసింది. బుధవారం మహిళల డబుల్స్‌ తొలి రౌండ్లో గాయత్రి ద్వయం 18-21, 21-11, 21-13తో సుయిన్‌-లిన్‌ యున్‌ జోడీపై గెలిచింది.

Published : 29 Feb 2024 01:49 IST

 

రూర్‌: జర్మనీ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ జంట శుభారంభం చేసింది. బుధవారం మహిళల డబుల్స్‌ తొలి రౌండ్లో గాయత్రి ద్వయం 18-21, 21-11, 21-13తో సుయిన్‌-లిన్‌ యున్‌ జోడీపై గెలిచింది. మరో మ్యాచ్‌లో రుతుపర్ణ-శ్వేతపర్ణ జంట 17-21, 21-10, 14-21తో అమేలీ-కారా (జర్మనీ) జోడీ చేతిలో ఓడింది. సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్‌, సతీష్‌ కుమార్‌ ముందంజ వేశారు. పురుషుల తొలి రౌండ్లో సతీశ్‌ 21-18, 19-21, 21-19తో మిషా జిబర్‌మ్యాన్‌ (ఇజ్రాయిల్‌)ను ఓడించగా.. మహిళల్లో ఆకర్షి 21-23, 21-17, 21-11తో పొలీనా బహ్రోవా (ఉక్రెయిన్‌)పై కష్టపడి నెగ్గింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని