జహీర్‌ నుంచి నేర్చుకున్నా

భారత దిగ్గజ పేసర్‌ జహీర్‌ఖాన్‌ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని ఇంగ్లాండ్‌ స్టార్‌ జేమ్స్‌ అండర్సన్‌ చెప్పాడు. ‘‘జహీర్‌ఖాన్‌ బౌలింగ్‌ను బాగా గమనించేవాడిని. అతడి బౌలింగ్‌ను చూసి చాలా విషయాలు నేర్చుకున్నా. జహీర్‌ ఏ విధంగా రివర్స్‌ స్వింగ్‌ చేసేవాడు..

Published : 29 Feb 2024 01:50 IST

దిల్లీ: భారత దిగ్గజ పేసర్‌ జహీర్‌ఖాన్‌ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని ఇంగ్లాండ్‌ స్టార్‌ జేమ్స్‌ అండర్సన్‌ చెప్పాడు. ‘‘జహీర్‌ఖాన్‌ బౌలింగ్‌ను బాగా గమనించేవాడిని. అతడి బౌలింగ్‌ను చూసి చాలా విషయాలు నేర్చుకున్నా. జహీర్‌ ఏ విధంగా రివర్స్‌ స్వింగ్‌ చేసేవాడు.. రనప్‌లో బంతిని బ్యాటర్‌కు కనబడకుండా ఎలా దాచిపెట్టేవాడు అనేవి అందులో కీలకం. జహీర్‌ లాగే నేనూ బంతులు వేసేందుకు ప్రయత్నించేవాడిని’’ అని అండర్సన్‌ చెప్పాడు. భారత్‌లో రివర్స్‌ స్వింగ్‌ ప్రధాన పాత్ర పోషిస్తుందని.. బుమ్రా ఈ కళలో ఆరితేరాడని.. అతడి ప్రదర్శనలు ఆశ్చర్యం కలిగించట్లేదని అండర్సన్‌ పేర్కొన్నాడు. ‘‘భారత్‌లో రివర్స్‌ స్వింగ్‌ కీలకం. బుమ్రా ఈ కళలో నిపుణుడు. అంతేకాదు అతడికి మంచి వేగం, స్థిరత్వం ఉంది. రెండో టెస్టులో ఒలీ పోప్‌కు వేసిన యార్కరే ఇందుకు ఉదాహరణ. అతడేమీ తేలిగ్గా నంబర్‌వన్‌ బౌలర్‌గా ఎదగలేదు. బుమ్రా అద్భుతమైన ప్రదర్శనలు ఆశ్చర్యం కలిగించట్లేదు. అతడితో పాటు షమి, సిరాజ్‌ లాంటి ప్రపంచ స్థాయి పేసర్లు భారత్‌ సొంతం. ఇషాంత్‌ శర్మ కూడా ఆ స్థాయి బౌలరే’’ అని అండర్సన్‌ అన్నాడు. 2002లో టెస్టు అరంగేట్రం చేసిన జిమ్మీ 700 వికెట్ల క్లబ్‌లో చేరేందుకు రెండు అడుగుల దూరంలో ఉన్నాడు. ముత్తయ్య మురళీధరన్‌, షేన్‌ వార్న్‌ మాత్రమే టెస్టుల్లో 700 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని