ప్రిక్వార్టర్స్‌లోకి రష్మిక, సహజ

ఐటీఎఫ్‌ మహిళల ఓపెన్‌ టోర్నమెంట్లో తెలుగమ్మాయిలు శ్రీవల్లి రష్మిక భమిడిపాటి, సహజ యమలాపల్లి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. సింగిల్స్‌ తొలి రౌండ్లో రష్మిక 6-1, 6-2తో ఇకుమి యమజాకి (జపాన్‌)ని ఓడించింది.

Published : 29 Feb 2024 01:52 IST

గుర్‌గ్రామ్‌: ఐటీఎఫ్‌ మహిళల ఓపెన్‌ టోర్నమెంట్లో తెలుగమ్మాయిలు శ్రీవల్లి రష్మిక భమిడిపాటి, సహజ యమలాపల్లి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. సింగిల్స్‌ తొలి రౌండ్లో రష్మిక 6-1, 6-2తో ఇకుమి యమజాకి (జపాన్‌)ని ఓడించింది. 12 గేమ్‌ల్లో కేవలం మూడు మాత్రమే చేజార్చుకున్న రష్మిక ఘన విజయం సాధించింది. సహజ 6-4, 6-2తో అయుమి కొషిషి (జపాన్‌)పై నెగ్గింది. ప్రిక్వార్టర్స్‌లో జాక్వెలిన్‌ అవాడ్‌ (స్వీడన్‌)తో రష్మిక.. భారత్‌కే చెందిన రియా భాటియాతో సహజ తలపడనున్నారు. మరోవైపు వైష్ణవి అద్కర్‌ (831) ర్యాంకుల్లో తన కన్నా మెరుగైన అకికో ఒమానె (686, జపాన్‌)కు షాక్‌ ఇచ్చింది. తొలి రౌండ్లో వైష్ణవి 6-4, 2-6, 6-1తో అకికోను ఓడించింది. తొలి సెట్‌ గెలిచి.. రెండో సెట్‌ను చేజార్చుకున్న వైష్ణవి.. నిర్ణయాత్మక మూడో సెట్లో ఒక్క గేమ్‌ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని