ముంబయిలో హార్దిక్‌కు మరింతగా..

రోహిత్‌ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా ఎంపికైన హార్దిక్‌ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు.

Updated : 28 Mar 2024 09:52 IST

ముంబయి: రోహిత్‌ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా ఎంపికైన హార్దిక్‌ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. ఈ సీజన్లో ముంబయి.. గుజరాత్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో (అహ్మదాబాద్‌) ప్రేక్షకులు అతణ్ని పదే పదే ఎగతాళి చేశారు. తాజాగా హైదరాబాద్‌లో సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లోనూ హార్దిక్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇక్కడే కాదు.. ముంబయి ఇండియన్స్‌ సొంతగడ్డలోనూ హార్దిక్‌కు హేళనలు తప్పవని అంటున్నాడు టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు మనోజ్‌ తివారి. కానీ హార్దిక్‌ ఇవన్నీ పట్టించుకోకుండా ఉత్సాహంతోనే కనిపిస్తున్నట్లు అతను చెప్పాడు. ‘‘ముంబయిలో అతడికెలాంటి స్వాగతం ఉంటుందో అంచనా వేయొచ్చు. అక్కడ హార్దిక్‌కు వ్యతిరేకంగా మరింత పెద్దగా అరవొచ్చు. ముంబయి ఇండియన్స్‌, రోహిత్‌ అభిమానులెవ్వరూ కెప్టెన్సీని హార్దిక్‌కు ఇస్తారని ఊహించి ఉండరు. అయిదుసార్లు ట్రోఫీ అందించినా.. రోహిత్‌ నాయకత్వాన్ని కోల్పోయాడు. ఇందుకు కారణాలేంటో తెలియదు. కానీ అభిమానులకు మాత్రం ఇది రుచించలేదు. దాని ఫలితం ఇలాగే ఉంటుంది. కానీ హార్దిక్‌ను టీవీలో చూస్తే తనను ఎగతాళి చేస్తున్నా అతను ప్రశాంతంగానే ఉన్నాడు. ఉత్సాహంతోనే కనిపించాడు’’ అని మనోజ్‌ తివారి అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని