భారత్‌-పాక్‌ సిరీస్‌.. ఆసీస్‌ ఆసక్తి

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది.

Published : 28 Mar 2024 02:38 IST

మెల్‌బోర్న్‌: భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. ఒకవేళ ఈ రెండు దాయాది దేశాలు తటస్థ వేదికలో ఆడాలనుకుంటే, సిరీస్‌ నిర్వహణకు ఆసీస్‌ సిద్ధంగా ఉంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా 2012-13 నుంచి భారత్‌, పాక్‌ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ఈ ఏడాది నవంబర్‌లో పాక్‌, భారత్‌.. ఆస్ట్రేలియాలో పర్యటించనున్నాయి. మొదట పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం పాకిస్థాన్‌.. ఆ తర్వాత టెస్టుల కోసం భారత్‌ అక్కడికి వెళ్తుంది. ‘‘ఎంసీజీలో భారత్‌, పాక్‌ పోరు అంటే ఎంతో ప్రత్యేకమైన సందర్భంగా నిలిచిపోతుంది. కేవలం మ్యాచ్‌ మాత్రమే కాదు అంతకంటే గొప్పగా ఉంటుంది. అందుకే ప్రజలు ఆ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ను చూడాలనుకుంటారు. ఒకవేళ అవకాశం వస్తే భారత్‌, పాక్‌ సిరీస్‌ నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం’’ అని క్రికెట్‌ ఆస్ట్రేలియా సీఈవో నిక్‌ హాక్‌లీ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని