కోచ్‌కు జకోవిచ్‌ టాటా

కోచ్‌ గోరాన్‌ ఇవానిసెవిచ్‌తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్‌ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్‌తో కలిసి జకోవిచ్‌ ప్రయాణం ప్రారంభించాడు.

Published : 28 Mar 2024 02:39 IST

లండన్‌: కోచ్‌ గోరాన్‌ ఇవానిసెవిచ్‌తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్‌ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్‌తో కలిసి జకోవిచ్‌ ప్రయాణం ప్రారంభించాడు. ఆ తర్వాత 12 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచాడు. కొన్ని రోజుల క్రితం నుంచే ఇవానిసెవిచ్‌తో కలిసి పని చేయడం మానేసినట్లు జకోవిచ్‌ బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ‘‘కోర్టులో మా ఇద్దరి బంధం ఒడుదొడుకులతో సాగింది. కానీ ఇద్దరి మధ్య స్నేహం మాత్రం ఎప్పుడూ రాతిలా దృఢంగా ఉంది’’ అని కోచ్‌ను ఉద్దేశించి జకో పేర్కొన్నాడు. ఈ ఏడాది జకో ఇప్పటివరకూ ఒక్క టైటిల్‌ కూడా గెలవలేకపోయాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సెమీస్‌లో నిష్క్రమించాడు. ఇటీవల జరిగిన ఇండియన్‌ వెల్స్‌ టోర్నీలో మూడో రౌండ్లో ఓడిపోయాడు. 2001లో వైల్డ్‌కార్డుతో వింబుల్డన్‌లో అడుగుపెట్టిన ఇవానిసెవిచ్‌ విజేతగా నిలిచాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని