‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ వల్లే ధోని అలా..

కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్‌ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ.

Published : 28 Mar 2024 02:40 IST

చెన్నై: కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్‌ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. కానీ అతనేమో బ్యాటింగ్‌కే రావట్లేదు. బ్యాటింగ్‌ ఆర్డర్లో మరీ దిగువకి వెళ్లిపోవడంతో మహికి బ్యాటు పట్టే అవకాశం రావట్లేదు. అయితే ఐపీఎల్‌లో గత ఏడాది ప్రవేశ పెట్టిన ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ నిబంధన వల్ల వచ్చిన సౌలభ్యం వల్లే మహి 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాల్సి వస్తోందని చెన్నై సూపర్‌కింగ్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌ మైకేల్‌ హసి అన్నాడు. ‘‘జట్టు ఆటను ముందుకు తీసుకెళ్లేందుకు కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ సూచనల ప్రకారమే ఇది జరుగుతోంది. ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ సౌలభ్యంతో మా బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలోపేతమైంది. అందుకే ధోని ఎనిమిదో స్థానంలో వస్తున్నాడు. అది విడ్డూరంగా అనిపించొచ్చు. అతను నెట్స్‌లో చక్కగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. మా బ్యాటర్లు సానుకూల ధోరణితో ఆడుతున్నారు. వారికి కోచ్‌లు, కెప్టెన్‌ మద్దతుంది. ఎవరైనా దూకుడుగా ఆడే ప్రయత్నంలో విఫలమైనా ఇబ్బంది లేదు’’ అని హసి అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని