సెమీస్‌లో బోపన్న జోడీ

44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్‌ వెటరన్‌ డబుల్స్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న మరో టైటిల్‌ దిశగా సాగుతున్నాడు.

Published : 28 Mar 2024 02:41 IST

మియామి గార్డెన్స్‌: 44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్‌ వెటరన్‌ డబుల్స్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న మరో టైటిల్‌ దిశగా సాగుతున్నాడు. మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా)తో కలిసి అతను.. మియామి ఓపెన్‌ పురుషుల డబుల్స్‌లో సెమీస్‌ చేరాడు. క్వార్టర్స్‌లో టాప్‌సీడ్‌ బోపన్న- ఎబ్డెన్‌ జోడీ 3-6, 7-6 (7-4), 10-7 తేడాతో వెర్బీక్‌ (నెదర్లాండ్స్‌)- పాట్రిక్‌ (ఆస్ట్రేలియా)పై గెలిచింది. తొలి సెట్‌లో ఓడినప్పటికీ బోపన్న ద్వయం గొప్పగా పుంజుకుంది. హోరాహోరీగా సాగిన రెండో సెట్‌లో ఒత్తిడిని దాటి విజేతగా నిలిచింది. టైబ్రేకర్‌లోనూ అదే జోరు కొనసాగించి మ్యాచ్‌ సొంతం చేసుకుంది. ఈ విజయంతో ఈ ఏడాది జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించే దిశగా బోపన్న మరో అడుగు ముందుకేశాడు. ప్రస్తుతం ఏటీపీ డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో అతను రెండో స్థానంలో ఉన్నాడు. జూన్‌ 10 లోపు టాప్‌-10లో ఉన్న ఆటగాళ్లు నేరుగా ఒలింపిక్స్‌ బెర్తు పట్టేస్తారు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ డబుల్స్‌ టైటిల్‌తో బోపన్న గ్రాండ్‌స్లామ్‌ బోణీ కొట్టిన సంగతి తెలిసిందే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని