సింధు శుభారంభం

మాడ్రిడ్‌ స్పెయిన్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు శుభారంభం చేసింది.

Published : 28 Mar 2024 02:42 IST

మాడ్రిడ్‌: మాడ్రిడ్‌ స్పెయిన్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో రెండో సీడ్‌ సింధు 21-16, 21-12 తేడాతో వెన్‌ యు జంగ్‌ (కెనడా)పై విజయం సాధించింది. 30 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో వెన్‌ నుంచి పోటీ ఎదురైనా ఆమె తట్టుకుని నిలబడింది. తొలి గేమ్‌లో 5-7తో వెనుకబడ్డ సింధు.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది.  14-14తో పోరు రసవత్తరంగా మారిన దశలో.. వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి ఆధిపత్యం ప్రదర్శించింది. అదే ఊపులో గేమ్‌ సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ మొదట ఇద్దరు క్రీడాకారిణులు పోటాపోటీగా తలపడ్డారు. కానీ 4-4తో స్కోరు సమమైన తర్వాత ఇక సింధు ఆగలేదు. షటిల్‌పై పూర్తి నియంత్రణతో ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి, చూస్తుండగానే గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ ముగించింది. రెండో రౌండ్లో హువాంగ్‌ (చైనీస్‌ తైపీ)తో సింధు తలపడుతుంది. మరోవైపు అశ్మిత 13-21, 11-21తో రచనోక్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో, సతీష్‌ 15-21, 19-21తో హెంగ్‌ (సింగపూర్‌) చేతిలో ఓడిపోయారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సతీష్‌-ఆద్య జోడీ 18-21, 14-21తో రినోవ్‌-హనింగ్‌త్యాస్‌ (ఇండోనేసియా) చేతిలో ఓడింది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని